జిల్లాలోని వయోజన విద్య, ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియెట్లో నమోదు సంఖ్యను పెంచాలని సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉల్లాస్, టాస్ రాష్ట్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా సిద్దిపేట అర్బన్ విద్యాశాఖ కార్యాలయంలో ఓపెన్ స్కూల్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ వయోజన విద్య, ఓపెన్ స్కూళ్లు ఇంటర్మీడియెట్ నమోదు పెంచేందుకు అధికారులు కృషిచేయాలన్నారు.