జిల్లాలోని నేషనల్ హైవే నిర్మాణప్రాంతమైన మిట్టపల్లి నుంచి జిల్లా పరీవాహక ప్రాంతం వరకు రోడ్డు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు, ఆటవీశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, గ్రామపంచాయతీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు 14 గ్రామాల మీదుగా నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు.