బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని శక్తి కేంద్ర ఇన్ఛార్జి తాటికొండ శ్రీనివాస్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సిద్దిపేట పట్టణ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. శక్తి కేంద్ర ఇంచార్జి తాటికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరాముని క్యాలెండర్ ప్రతి ఒక్కరికి అందించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.