మత్తు పదార్థాలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, వాటి జోలికి పోవొద్దని సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ అన్నారు. మంగళవారం సిటిజన్ స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఒకసారి అలవాటు పడితే జీవితాలు దుర్భరంగా మారుతాయని అన్నారు.