గత నెల లోక్ అదాలత్ కేసుల్లో రాజీ కుదర్చటంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏజీపీ, ఏసీపీ, పీపీ, సీఐ, ఎస్సై, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బందిని కోర్టు కార్యాలయంలో సిద్ధిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అభినందించి వారికి మంగళవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్వాతిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి మిలింద్ కాంబ్లే, అదనపు సీనియర్ సివిల్ జడ్జి చందన తదితరులు పాల్గొన్నారు.