డ్రైవర్లు ప్రతి రోజు వాహనాల కండీషన్ ను పరిశీలించి వాహనాలను నడపాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ సూచించారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ వాహనాల కండీషన్ ను ఏఆర్ అడిషనల్ డీసీపీ, పోలీసు ఎంటీఓ ధరణికుమార్, మెకానిక్ సహాయంతో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు డీసీపీ మాట్లాడుతూ, వాహనంలో వాటర్, ఆయిల్, బ్యాటరీ కండీషన్ పరిశీలించి వాహనాలను నడపాలన్నారు.