
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ.. 40 రోజుల్లోనే 61 మంది మృతి
మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత 40 రోజుల్లోనే ఏకంగా 61 మంది వరకు మావోయిస్టులు మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. జనవరి 5న జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు, 12న ముగ్గురు మావోయిస్టులు, 16న 12 మంది మావోయిస్టులు, 21న 16 మంది మావోయిస్టులు, జనవరి 29న ఇద్దరు మావోయిస్టులు, ఫిబ్రవరి 2న 12 మంది మావోయిస్టులు, ఫిబ్రవరి 9న కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.