ఆడబిడ్డలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళ ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వంలో అనేక అవమానాలు ఎదురయ్యాయన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కార్యదర్శి గ్యాదరి మధు, యువజన అధ్యక్షుడు గయాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.