
వైసీపీ నేతలకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సీరియస్ వార్నింగ్
AP: కూటమి నేతలను నరుకుతానంటూ వైసీపీ నేత కారుమూరి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి నేతల జోలికొస్తే కాళ్లు, చేతులు నరికేస్తానని హెచ్చరించారు. అవినీతి కేసులో కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. టీడీఆర్ కుంభకోణంలో కారుమూరి జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. వైసీపీ మందను ప్రజలు ఇంటికి తోలేశారని విమర్శించారు.