ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్

52చూసినవారు
ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్
అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ కు చెందిన నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడిన 47 మంది ఆకతాయిలకు సంబంధిత పోలీసు స్టేషన్లలో జూమ్ మీటింగ్ ద్వారా మహిళ భద్రతా విభాగం నిపుణులు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్