దౌల్తాబాద్: విద్యార్థిని కార్తీకను సన్మానించిన అధ్యాపక బృందం
ఆవర్తన మూలకాలను అతి తక్కువ సమయంలో కంఠస్థం చేయడంతో ప్రపంచ రికార్డు సృష్టించిన బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పంజాల కార్తీకకు పిఆర్టియు టిఎస్ రాయపోల్ మండల శాఖ తరపున ఘన సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగిందని ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి కార్తీక, సలహాదారుడు కొల్కూరి భాస్కర్ రెడ్డిలను సన్మానం చేశారు.