దౌల్తాబాద్: మంచి ఫలితాలకు కృషి చేద్దాం
రాయపోల్ మండల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా కృషి చేయాలని వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పాఠశాలల రికార్డులన్నిటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. పిల్లల విద్యాభివృద్ధికై ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.