దౌల్తాబాద్: ప్రత్యేక తరగతులను పరిశీలించిన ఎంఈఓ
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో పదవ తరగతి ప్రత్యేక తరగతులను మండల విద్యాధికారి గజ్జల కనకరాజు పరిశీలించారు. విద్యార్థులు బాగా కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని, పదవ తరగతి విద్యార్థి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనదని మండల విద్యాధికారి శుక్రవారం అన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు.