సిద్దిపేట స్థానిక పార్వతీదేవి దేవాలయంలో ఈరోజు విశ్వహిందూ పరిషత్ విభాగం మాట్లాడుతూ పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. లడ్డు ప్రసాదంలో నెయ్యి కి బదులు జంతువుల కొవ్వులను కలిపి తయారుచేయడాన్ని VHP తీవ్రంగా ఖండిస్తోంది. అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.