

బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు సజీవ దహనం (వీడియో)
పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. నదియా జిల్లా కళ్యాణిలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కళ్యాణిలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.