యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని సిద్దిపేట ఏసీపీ మధు అన్నారు. ప్రజల రక్షణకు పోలీసు శాఖ ఎప్పుడు ముందుంటుందన్నారు. పట్టణంలోని స్థానిక కేసిఆర్ నగర్ లో మంగళవారం కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 54 ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు సీజ్ చేశారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.