మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రెడ్యా నాయక్ తండాలో చోటు చేసుకుంది. పోలీసు వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని రెడ్యానాయక్ తండాకు చెందిన జాటోత్ చందు అనే వ్యక్తి ఏడు నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.