పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నామని వన్ టౌన్ సీఐ లక్ష్మీబాబు శుక్రవారం అన్నారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించారు. పీఎస్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.