తల్లి జన్మనిస్తే ఒక ఆపదలో ఉన్న పేషెంట్‌కు పునర్జన్మని ఇచ్చేది డాక్టర్ అని BRS మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డాక్టర్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో హరీశ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న డాక్టర్లకు మరింత బాధ్యతగా సేవలు చేసే విధంగా, కొత్తవారిని సేవలు చేసే విధంగా ఈ అవార్డులు దోహదం చేస్తాయని చెప్పారు. వైద్యో నారాయణో హరి అని అంటారని పేర్కొన్నారు.