సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

85చూసినవారు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు
సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 28వ తేదీ ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సిద్ధిపేట పోలీసు కమిషనర్ డా. బి. అనురాధ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు పోలీసుల ముందస్తు అనుమతి లేనిదే నిర్వహించకూడదన్నారు. అలాగే డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్