అత్యవసర సమయంలో రిటైర్డ్ పోలీసుల సేవలు వినియోగించుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు సిపి అనురాధను గురువారం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, రిటైర్డ్ పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రాజులు పాల్గొన్నారు.