సిద్దిపేట పరిధిలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025-26 సంవత్సరానికి 4 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అడ్మీషన్ ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి ఇమ్రానా బేగం శుక్రవారం తెలిపారు. బాల కార్మికులు, బడి మానేసి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల పిల్లలు ప్రవేశాలకు అర్హులన్నారు. బాలురకు మాత్రమే అవకాశమని, వివరాలకు 9640763713, 9949954247 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.