వృద్ధులు, నిరాశ్రయుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని లాల్ బహదూర్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల, వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు. వారితో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారం చేయిస్తానన్నారు.