
విమాన ప్రమాదం.. 81 డెడ్‌బాడీల రికవరీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలో మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 81 మృతదేహాలను వెలికితీశామని NDRF ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య ఖచ్చితంగా ఎంతనేది చెప్పలేమని అన్నారు. ప్రస్తుతానికి 7 NDRF బృందాలు పని చేస్తున్నాయి. ఈ దుర్ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ స్టార్ట్ చేసింది.