

VIDEO: ఒకే ఇంట్లో ఆరుగురికి 'తల్లికి వందనం'
ఏపీలో కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేసింది. ఇక తమ ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం పథకం డబ్బులు అందాయని ఓ మహిళ సంతోషం వ్యక్తం చేసింది. తమ ఫ్యామిలీకి రూ.78,000 అందాయని, ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతూ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.