
తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.170-180 వరకు ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.190-200 వరకు విక్రయిస్తున్నారు. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.170-180 వరకు ఉంది. స్కిన్ లెస్ కేజీ ధర రూ.200-210 వరకు ఉంది. తెలంగాణలో డజన్ కోడి గుడ్ల ధర రూ.78, ఏపీలో రూ.78గా ఉంది.