జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. సరోజ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా పంచాయతి అధికార దేవికా దేవి, ప్రభుత్వ బీసి వసతి గృహ సంక్షేమ అధికారులు హాజరయ్యారు.