ఆర్య వైశ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలి

58చూసినవారు
ఆర్య వైశ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలి
సిద్దిపేట పట్టణంలోని ఆర్య వైశ్య సమితిలో సభ్యత్వం ఇవ్వాలని శుక్రవారం వైశ్యులు నిరసనకు దిగారు. కరీంనగర్ రోడ్డు సమీపంలో వైశ్య భవనం నిర్మాణం జరిగింది. అందులో రూ. 51 వేలు ఇచ్చిన వారికే సభ్యత్వం ఇవ్వడంతో వైశ్య నాయకులు వెంకటేశం, వెంకటరమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్య వైశ్యభవన్ నుంచి వైశ్యసమితి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమితి ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్