
విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష
గుజరాత్ అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, రామ్మోహన్‌కు మోదీ ఫోన్ చేశారు. విమాన ప్రమాదంపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి తనకు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి కేంద్రమంత్రి రామ్మోహన్ బయల్దేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానాశ్రయం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు దూరంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.