ఈనెల 12న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా

63చూసినవారు
ఈనెల 12న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు వారి బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9963357250, 9885346768 సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్