ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హైమావతి హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన అనేక అంశాలపై వారిరువురు చర్చించారు. కలెక్టర్ ను మంత్రి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.