మిరుదొడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు

70చూసినవారు
మిరుదొడ్డి: సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు
విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు మహేష్ బుధవారం అన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో విద్యా బోధన చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టర్ ఉద్యోగులు మండల వనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.