నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ

63చూసినవారు
నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ
నూతన చట్టాలు మహిళలకు మరింత రక్షణగా నిలుస్తాయని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో షీటీమ్స్ హాట్స్ స్పాట్ల వద్ద నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత నెలలో 20 మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా షీటీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్