వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ మంజుల అన్నారు. ఆదివారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సమస్యలు తెలియజేసేందుకు 9505507248 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.