చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం రాజగోపాలపేట ఎస్ఐ అసిఫ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఖాతా పరమేశ్వర్ చెల్లితో పాటు నర్మెట్టలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పరమేశ్వర్ చెల్లెలి పెళ్లి ఎలా చేయాలో తెలియక ఆందోళన చెందేవాడు. ఈ క్రమంలో 9న అమ్మమ్మ వాడే బీపీ మాత్రలను మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.