సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఆవరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి, అధికారులు మరియు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాటమే ఊపిరిగా సాగిన ప్రస్థానమని అన్నారు.