అందరూ కలిసి, మెలసి పండుగ నిర్వహించుకోవాలని సిద్దిపేట ఏసీపీ మధు, సీఐ లక్ష్మీబాబు అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా ముస్లిం పెద్దలతో వన్ టౌన్ పోలీసు స్టేషన్లో బుధవారం ఏసీపీ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మజీద్ లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏమైనా సమస్య ఉన్నా వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.