మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విశ్వశాంతికి మార్గదర్శనము

76చూసినవారు
మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విశ్వశాంతికి మార్గదర్శనమని, ఒక్క ఇస్లాం ధర్మనికే కాకుండా ఆయన మొత్తం మానవాళికి ప్రవక్త అని ఉలేమాలు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఉలేమాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు, ఇమామ్లు ఇక్బాల్ ఆశ్రఫీ, కరీంపటేల్లు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కారణజన్ముడని అన్నారు.

ట్యాగ్స్ :