

యూపీలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని ఓ దుకాణం, గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. "మంటలను అదుపులోకి తెచ్చాం. ప్రాణనష్టం ఎవరికి జరుగలేదు" అని అగ్నిమాపక అధికారి సుశీల్ కుమార్ తెలిపారు. మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయని, ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.