జిల్లాలోని షీ టీమ్స్ మహిళలు, బాలికల భద్రత, భరోసా కోసం పనిచేస్తున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని షీ టీమ్స్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు ఈనెల 1 నుంచి 15 వరకు వివిధ కళాశాలల్లో అవగాహన కల్పించారని తెలిపారు. మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. 13 మంది ఈవ్ టీజర్లను పట్టుకొని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పెట్టి కేసులు నమోదు చేశామన్నారు.