వేడుకగా వాసవీ మాత పారాయణం

78చూసినవారు
వేడుకగా వాసవీ మాత పారాయణం
సిద్దిపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఇందిరమ్మ కాలనీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వాసవీ మాత పారాయణం నిర్వహించారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాంకాల శ్రీనివాస్ తెలిపారు. 21 వారాలుగా ఈ కార్యక్రమంలో కొనసాగిందని ముగింపు క్రతువులో భాగంగా ప్రతి ఇంటి నుంచి భక్తులు 21 ప్రసాదాలను అమ్మ వారికి నైవేద్యంగా సమర్పించారని అన్నారు. కార్యక్రమంలో పూర్వఅధ్యక్షుడు చింత శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్