సిద్ధిపేట పట్టణంలోని నయీమ్ మియా గ్రాండ్ సన్స్ జువెల్లరీ షాప్ కు ఒక వ్యక్తి వచ్చి తనకు బంగారు గొలుసు కావాలని అడిగాడు. సిబ్బంది గొలుసులను చూపిస్తుండగా ఆ వ్యక్తి 10 గ్రాముల బరువున్న 8 బంగారు గొలుసులు బాక్సును దొంగిలించాడు. షాప్ నిర్వాహకుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఐ ఉపేందర్ ఘటన స్థలానికి చేరుకొని సిసి కెమెరాలు పరిశీలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.