సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకి బుధవారం తెలిపారు. హైదరాబాద్ నుండి ఆరోగ్యం-సీజనల్ వ్యాధులు- సంసిద్ధత, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితులు, స్వచ్ఛదనం - పచ్చదనం పురోగతిలపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.