అక్బర్ పేట భూంపల్లి మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భూంపల్లిలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తరగతి గదుల్లో తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పి అనుభవాలను తెలుసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భూంపల్లి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేందర్ తో కలిసి మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య గౌడ్ బహుమతులు అందజేశారు.