సిద్ధిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 26 మందికి రూ. 40వేల జరిమానా

72చూసినవారు
సిద్ధిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 26 మందికి రూ. 40వేల జరిమానా
మద్యం తాగి పట్టుబడిన పలువురు వాహనదారులకు సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు శుక్రవారం జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా 26 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 26 మందికి మొత్తంగా రూ. 40, 000 జరిమానా విధించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్