
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం: పవన్ కళ్యాణ్
AP: దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. పాకిస్తాన్లోని ఇళ్లల్లోకి దూరెళ్లి కొడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పవన్ పాల్గొని మాట్లాడారు. ‘భారత్లో జరిగిన ఉగ్రదాడులన్నింటిలో పాకిస్తాన్ హస్తం ఉంది. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో పేలుళ్లకు పాల్పడింది. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీకి అండగా ఉంటాం.' అని పవన్ అన్నారు.