సిద్దిపేట: అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం

69చూసినవారు
సిద్దిపేట: అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూ భారతావని ముందుకు సాగాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ లు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రగతికై అహర్నిశలు కృషి చేసిన మహానీయులు అంబేద్కర్ బాటలో సాగాలన్నారు. కార్యక్రమంలో మట్టపల్లి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్