బెస్ట్ అవైలబుల్ పథకంలో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించేందుకు ఆసక్తి కల్గిన పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి కవిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొంది, విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాలన్నారు. ఈనెల 31 వరకు తమ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు.