

మహిళలతో దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ (వీడియో)
TG: నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మహిళలతో ఎస్ఐ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బందోబస్తులో ఉన్న నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు మహిళలను నెట్టివేస్తూ దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. SI తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.