బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం ఖాయమని జిల్లా నేత తొడుపునూరి వెంకటేశం అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు ఖాయమైందని, మెజార్టీపై దృష్టి సారించామన్నారు. ఇద్దరు బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు.